ENGLISH | TELUGU  
Home  » TV News

సోషల్ మీడియాలో రచ్చ.. కమ్యూనిటీ ఓట్ల గురించి సీక్రెట్‌గా మాట్లాడుకున్న నబీల్, మెహబూబ్!

on Oct 16, 2024

 

బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఊహించనది జరుగుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులని  అలరించే ఈ షోలో ఇప్పుడు కొన్ని మతపరమైన అంశాలు తెరమీదకి వచ్చాయి.

నిన్నటి ఎపిసోడ్ లో అర్థరాత్రి ముచ్చట్లలో నబీల్, మెహబూబ్ మాట్లాడుకున్న కొన్ని మాటలు వీడియోగా బయటకు వచ్చాయి. వీళ్ళిద్దరి మధ్య కమ్యూనిటీ గురించి టాపిక్ సాగడం ఇప్పుడు పెద్ద ఇష్యూ అయ్యింది. అసలేం జరిగిందంటే నిన్న రాత్రి మెహబూబ్, నబీల్ మాట్లాడుకున్నారు. మొదటగా నబీల్ హౌస్ లోకి వచ్చాక ఎలా ఉందో.. నామినేషన్ అంటే ఎలా భయపడ్డాడో చెప్తాడు. ఆ తర్వాత మొన్న నేను నీకు అవకాశం ఇచ్చినప్పుడు అందరు మనమిద్దరం ఒకటే కమ్యూనిటీ అని అనుకునే అవకాశం ఉంది కదా.. కానీ నేను అలా చేయలేదని నబీల్ అన్నాడు. దాంతో మెహబూబ్ అవును.‌. అయిన మనకి మన(కమ్యూనిటీ) ఓట్లు పడతాయి. అయితే మనమిద్దరం ఒకేసారి నామినేషన్ లో ఉండకుంటా చూసుకోవాలని నబీల్ తో మెహబూబ్ అంటాడు. దానికి ఊ.. ఊ.. అనుకుంటూ సరే అంటాడు నబీల్. " మనమిద్దరం ఉంటే అందరికి కాంపిటీషన్ లో మనం కొంచెం వీక్ అవుతాం.. మనమిద్దరం నామినేషన్ లో ఉంటే మనకి పడే ఓట్లు డివైడ్ అవుతాయి. నువ్వైనా ఉండాలి.. లేదా నేనైనా ఉండాలి అప్పుడే మనం సేవ్ అవుతాం " అని మెహబూబ్ అంటాడు.

నబీల్ హౌస్ లో ఇప్పటి దాకా హౌస్ లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఎవరేం చెప్పినా వింటాడు. అందులో ఏది మంచిదో అది తీసుకొని , చెడుని అది తప్పు అని చెప్తాడు. అయితే ఈ డిస్కషన్ లో నబీల్ అవునంటూ తల ఊపడం, సరే అనడం అనేది ముమ్మాటికే తప్పే.. దీంతో అన్నీ కమ్యూనిటీలు నబీల్, మెహబూబ్ ని వ్యతిరేకించే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే నబీల్, మెహబూబ్ దీని గురించి సరైన వివరణ ఇవ్వకపోతే అసలు ఓటింగే ఉండదనేది వాస్తవం. మరి వీకెండ్ లో నాగార్జున ఈ టాపిక్ గురించి ఆరా తీస్తాడో లేదో చూడాలి.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.